కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఒక రూపాయి జరిమానా చెల్లించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. సెప్టెంబర్ 15 కల్లా ఒక రూపాయిని కోర్టుకు డిపాజిట్ చేయాలని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. డిపాజిట్ చేయకపోతే 3 నెలల జైలు శిక్ష, 3 ఏళ్ల పాటు ప్రాక్టీస్‌పై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా - ప్రశాంత్ భూషణ్
ప్రశాంత్ భూషణ్
12:36 August 31
జూన్ 27, 29న ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. తనకున్న ప్రాథమిక హక్కులతోనే ఆ ట్వీట్లు చేసినట్లు భూషణ్ పేర్కొన్నారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు 14న ఆయన్ను దోషిగా తేల్చింది. బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు సమయమిచ్చినా ఆయన నిరాకరించడం వల్ల ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
12:20 August 31
ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా
- కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్ కు శిక్ష ఖరారు
- తీర్పు వెలువరించిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం
- ఒక రూపాయి జరిమాన విధించిన సుప్రీంకోర్టు
- సెప్టెంబర్ 15 కల్లా ఒక రూపాయిని కోర్టుకు డిపాజిట్ చేయాలని ఆదేశం
- డిపాజిట్ చేయలేకపోతే 3 నెలలు జైలు శిక్ష, 3 ఏళ్ల పాటు ప్రాక్టీస్ పై నిషేధం
Last Updated : Aug 31, 2020, 12:48 PM IST