తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఉప వర్గీకరణపై సుప్రీం సమీక్ష - ఎస్సీ, ఎస్టీ కులాల వర్గీకరణ వార్తలు

ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఉప వర్గీకరణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ కులాల్లో ఉప కులాలు ఉండొచ్చని అభిప్రాయపడింది. గతంలో తాము ఇచ్చిన తీర్పును పునః సమీక్షించనున్నట్లు స్పష్టం చేసింది.

SUPREME COURT HEARING ON SC,ST classification
'ఎస్సీ, ఎస్టీ కులాల వర్గీకరణపై రాష్ట్రాలకు హక్కులు'

By

Published : Aug 27, 2020, 12:50 PM IST

ఉద్యోగాల కల్పన, విద్యా సంస్ధల్లో ప్రవేశాల కోటా కోసం షెడ్యూల్​ కులాల్లో ఉప వర్గీకరణ ఉండొచ్చని అభిప్రాయపడింది అత్యున్నత న్యాయస్థానం. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2004లో తాము ఇచ్చిన తీర్పుపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని సుప్రీం అభిప్రాయపడింది.

విస్తృత ధర్మాసనానికి బదిలీ..!

ఎస్సీ, ఎస్టీ కులాల ఉప వర్గీకరణ కోసం పంజాబ్​ ప్రభుత్వం చట్టాలను చేయగా.. ఆ రాష్ట్ర హైకోర్టు వాటిని కొట్టివేసింది. అయితే సుప్రీంలో సవాల్​ చేసిన ఆ ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా తాజాగా తీర్పునిచ్చింది జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.

2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్​ ఆంధ్రప్రదేశ్​ కేసులో షెడ్యూల్​ కులాల్లో మళ్లీ ఉపకులాలు అవసరం లేదని.. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆనాటి తీర్పును తాజాగా విభేదించింది. 2004 తీర్పును పునః సమీక్షించి తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈ అంశాన్ని.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​.ఏ.బోబ్డేకు నివేదించింది ఐదుగురు సభ్యుల ధర్మాసనం. రెండు సమాన రాజ్యాంగ ధర్మాసనాల తీర్పుల్లో విభేదాలు ఉండటం వల్ల కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details