మసీదుల్లో ముస్లిం మహిళల ప్రవేశాన్ని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. భిన్నమైన కారణాలతో ఈ వ్యాజ్యం విచారణను పదిరోజులు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే ఆ కారణాలు ఏమిటన్నవి సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించలేదు.
మసీదుల్లో ముస్లిం మహిళల ప్రవేశంపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పుణెకు చెందిన యస్మీన్, జుబెర్ అహ్మద్ నజీర్ అహ్మద్ పీర్జాడే దంపతులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇది లింగ సమానత్వాన్ని కూడా దెబ్బతీస్తోందని వారు వాదించారు. ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రవేశించి నమాజ్ చేయడానికి అనుమతించేలా ప్రభుత్వ అధికారులు, ముస్లిం సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని తమ పిటిషన్లో కోరారు.
నాలుగు వారాల సమయం