తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పరీక్షలు ఎవరికి ఉచితంగా చేయాలంటే.? - Ayushman Bharat latest news 2020

కొవిడ్‌-19 నిర్ధరణ పరీక్షలు ఉచితంగానే చేయాలని సుప్రీంకోర్టు ఇటీవలె కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు ప్రైవేటు ల్యాబ్​లు అభ్యంతరాలు లేవనెత్తగా... సోమవారం ఈ అంశంపై మరోసారి సమీక్షించింది అత్యున్నత న్యాయస్థానం. అనంతరం ఎవరికి కరోనా టెస్టులు ఉచితంగా చేయాలో స్పష్టతనిచ్చింది.

Supreme Court Clarified about free COVID-19 tests only to "economically weaker sections" who are covered under Ayushman Bharat
'కరోనా ఉచిత పరీక్షలు వారికి మాత్రమే ఉచితం'

By

Published : Apr 14, 2020, 6:21 AM IST

కరోనా వైరస్‌ పరీక్షలు కేవలం పేదలకు మాత్రమే ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిధిలోకి ఎవరు వస్తారనేది ప్రభుత్వమే నిర్ణయించాలని చెప్పింది. గత వారం మహమ్మారి నిర్ధరణ పరీక్షలు అందరికీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ప్రైవేట్‌ ల్యాబ్​లు ఉచితంగా టెస్టులు చేయలేమని పేర్కొనడం వల్ల తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

పేదలకు మాత్రమే ఉచితంగా...

"ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి అర్హులైన వారికి, ప్రభుత్వం గుర్తించిన ఆర్థిక బలహీన వర్గాలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించాలి" అని సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులో స్పష్టం చేసింది. వారితో పాటు అనధికారిక రంగాలలో తక్కువ ఆదాయం సంపాదించే కార్మికులకు.. ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు పొందే లబ్ధిదారులు సహా ఇతర వర్గాలకూ ఉచితంగా టెస్టులు నిర్వహించడంపై కేంద్రం, వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ అంశంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

విదేశాల్లో ఉన్నవారిని తీసుకురమ్మనలేం..

కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వివిధ అవసరాల నిమిత్తం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారందరినీ స్వదేశానికి తీసుకురావాలంటూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఇంగ్లాండ్, అమెరికా, ఇరాన్‌తోపాటు గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారి కోసం దాఖలైన పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని.. కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడివారు అక్కడే ఉండటం మేలని అభిప్రాయపడింది.

విదేశాల్లోని భారతీయుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందర్నీ స్వదేశానికి తీసుకురమ్మని ప్రభుత్వానికి చెప్పలేమని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బొబ్డే పేర్కొన్నారు. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

ఇదీ చదవండి: కరోనా పరీక్షలు ఉచితంగా చేయండి: సుప్రీం

ABOUT THE AUTHOR

...view details