తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీజేఐపై ఆరోపణల కేసులో అంతర్గత విచారణ - భారత ప్రధాన న్యాయమూర్తి

సీజేఐ జస్టిస్ రంజన్​ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ ప్రారంభించింది. ఆరోపణలు చేసిన మహిళ ముగ్గురు సభ్యుల ప్యానెల్​ ముందు హాజరయ్యారు.

సీజేఐపై ఆరోపణల కేసులో అంతర్గత విచారణ

By

Published : Apr 26, 2019, 5:07 PM IST

Updated : Apr 26, 2019, 8:52 PM IST

సీజేఐపై ఆరోపణల కేసులో అంతర్గత విచారణ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయిపై ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు ప్రత్యేక ప్యానెల్​ అంతర్గత విచారణ చేపట్టింది. జస్టిస్ ఎస్​ఏ బాబ్​డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ప్యానెల్​ ముందు ఆరోపణలు చేసిన సుప్రీం మాజీ ఉద్యోగిని హాజరయ్యారు.

కేసు వివరాల్ని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ప్యానెల్​కు సమర్పించారు. విచారణ సమయంలో ఆరోపణలు చేసిన మహిళ ఒక్కరే ఉన్నారు. సాధారణ విచారణ కాకపోవడం వల్ల సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్​ను, మహిళ తరఫు న్యాయవాదిని అనుమతించలేదు. తదుపరి విచారణ తేదీని ప్యానెల్ త్వరలో ప్రకటించనుంది.

అసాధారణ రీతిలో...

సీజేఐపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ కోసం సుప్రీంకోర్టు జస్టిస్​ ఎస్​ఏ బాబ్​డే నేతృత్వంలో ప్రత్యేక ప్యానెల్​ ఏర్పాటు చేసింది.

విచారణ పూర్తి చేసేందుకు గడువు ఏమీ లేదని జస్టిస్​ ఎస్​ ఏ బాబ్​డే ఇటీవల చెప్పారు. విచారణలో తేలిన అంశాలను రహస్యంగా ఉంచి, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: విచారణ కమిటీ నుంచి జస్టిస్​ రమణ నిష్క్రమణ

Last Updated : Apr 26, 2019, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details