తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా అంతానికి సూపర్​ కంప్యూటర్లు..! - coron new deaths

కరోనా వ్యాప్తి నియంత్రణకు పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఈ మహమ్మారిని తుదముట్టించేందుకు సూపర్​ కంప్యూటర్లను వినియోగిస్తున్నారు పరిశోధకులు. వాటితో ఏం చేస్తారు అనుకుంటున్నారు కదూ?. మీరే చూడండి.

Supercomputers to the end of Corona ..!
కరోనా అంతానికి సూపర్​ కంప్యూటర్లు..!

By

Published : Apr 9, 2020, 8:51 AM IST

కరోనా మహమ్మారిని అంతం చేయడానికి పరిశోధకులు సూపర్‌ కంప్యూటర్లనూ వినియోగిస్తున్నారు. వైరస్‌ని నివారించే కొత్త యాంటీ వైరల్‌ని గుర్తించేందుకు వీలుగా ఔషధాల డేటాబేస్‌ని, వివిధ దశల్లో ఉన్న పరిశోధనల సమాచారాన్ని వడపోస్తున్నారు. సాధారణ కంప్యూటర్లతో నెలల కాలం పట్టే ఈ పని.. సూపర్‌ కంప్యూటర్లతో వారాల్లోనే పూర్తికానుంది. అమెరికాలోని ఓక్రిడ్జ్‌ నేషనల్‌ ల్యాబ్‌లోని ‘సమ్మిట్‌’.. ప్రపంచంలోనే శక్తిమంతమైన సూపర్‌కంప్యూటర్‌. దీంతోపాటు జర్మనీలోని సూపర్‌ ఎంసీయూ-ఎన్‌జీ సూపర్‌కంప్యూటర్‌ని ఈ సమాచార శోధనలో వినియోగిస్తున్నారు.

యూరోపియన్‌ యూనియన్‌లో అతిపెద్ద పరిశోధన, ఆవిష్కరణ కార్యక్రమం ‘హారిజన్‌ 2020’. ఇందులోని జీవ ఔషధ గణన కేంద్రం అధినేత పీటర్‌ కొవిని, అమెరికా, యూరప్‌లకు చెందిన వంద మందికిపైగా పరిశోధకులు ఉమ్మడిగా ఈ కృషి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details