ఆరోగ్య పరిస్థితుల దృష్య్టా తాను రాజకీయాల్లోకి రాలేనని రజనీకాంత్ ప్రకటించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమిళనాడులోని విల్లుపురం జిల్లా, పానంపట్టు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే అభిమాని గురువారం(డిసెంబర్31) చనిపోయాడు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదనే ప్రకటనతో రాజ్‌కుమార్ తీవ్రమనస్తాపం చెందాడని స్థానికులు తెలిపారు. ఫేస్బుక్లో ఇదే తన చివరి రోజని పేర్కొన్నాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవించి తన ఇంటికెళ్లి నిద్రపోయాడు. మరుసటి రోజున చూసే సరికి చనిపోయి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
అయితే మృతికి గల కారణాలు తెలియలేదని పేర్కొన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.