ఊహాగానాలకు తెరదించుతూ భాజపా తీర్థం పుచ్చుకున్నారు బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ దేఓల్. భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించి రాజకీయ అరంగేట్రానికి సిద్ధమయ్యారు. దిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన.
మూడున్నర దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను అలరించారు దేఓల్. గాయల్, దామిని, బోర్డర్, గదర్ ఏక్ ప్రేమ్ కథ వంటి అద్భుత చిత్రాలు అందించారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఎంతమేర ప్రభావం చూపించనున్నారన్నది ఆసక్తికరం.
అందివచ్చిన అవకాశం
పంజాబ్‌లో సత్తా చాటాలని ఎప్పటి నుంచో భాజపా ప్రయత్నాలు చేస్తోంది. సిక్కుల గడ్డపై ఇప్పటివరకు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్దే హవా. ప్రస్తుతం ఆప్ కూడా పంజాబ్‌లో పాగా వేయాలని చూస్తోంది. భాజపా పరిస్థితి చూస్తే 2014లో మోదీ ప్రభంజనంలోనూ అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలోని 13 స్థానాల్లో భాజపాకు 2, మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు 4స్థానాలే వచ్చాయి.
ఈసారీ భాజపాకు సరైన బలం లేక 3 స్థానాల్లో పోటీలో నిలవగా.. శిరోమణి 10స్థానాల్లో పోటీ చేస్తోంది. బరిలోకి దిగనున్న అమృత్‌సర్, గురుదాస్‌పుర్, హోషియార్‌పుర్‌లో బలమైన అభ్యర్థుల అన్వేషణలో ఉంది భాజపా. ఈ పరిస్థితుల్లో సన్నీ దేఓల్ రూపంలో ఓ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. పార్టీలో చేరిన కొద్దిగంటలకే గురుదాస్‌పుర్ నుంచి సన్నీ పోటీ చేస్తారని భాజపా ప్రకటించింది.
తండ్రి బాటలో..