తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య తీర్పు: 'పునః సమీక్ష పిటిషన్​ దాఖలు చేయబోం' - .ayodhya verdict latest news .

దశాబ్దాల నుంచి నలుగుతోన్న అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న సున్నీ వక్ఫ్​బోర్డు.. న్యాయస్థానం నిర్ణయంపై పునః సమీక్ష పిటిషన్ దాఖలు చేయబోమని పేర్కొంది.

అయోధ్య తీర్పు: 'పునస్సమీక్ష దాఖలు చేయబోం'

By

Published : Nov 9, 2019, 5:45 PM IST

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించింది ఉత్తర్​ప్రదేశ్​ సున్నీ వక్ఫ్​ బోర్డు. కోర్టు తీర్పుపైపునః సమీక్ష పిటిషన్ దాఖలు చేసే ఆలోచన లేదని తేల్చిచెప్పింది.

"అయోధ్యకేసుపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పును సవాలు చేసే ఆలోచన మాకు లేదు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నాం. అనంతరం మా అభిప్రాయాన్ని సవివరంగా ప్రకటిస్తాం. కోర్టు తీర్పును బోర్డు సవాలు చేస్తుందని ఎవరైనా ప్రకటిస్తే అది సరైన ప్రకటన కాదని భావించాలి."

-జాఫర్ అహ్మద్ ఫారూకీ, సున్నీ వక్ఫ్​ బోర్డు ఛైర్మన్

అయితే అంతకుముందుఅఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డ్ దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. అయోధ్య తీర్పులో చాలా వైరుధ్యాలు ఉన్నాయని.. పునః సమీక్ష కోరతామని సున్నీ బోర్డు కార్యదర్శి జాఫర్యాబ్ జిలానీ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: అయోధ్య తీర్పునకు మార్గం చూపిన 27 ఏళ్ల నాటి చట్టం!

ABOUT THE AUTHOR

...view details