అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పూరీని ప్రశ్నించడంలో నాటకీయ పరిణామాల మధ్య విఫలమైంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ కార్యాలయానికి చేరుకున్న రతుల్‌ను కొద్ది సమయం వేచి చూడాలని కోరగా బాత్రూంకు వెళ్లే నెపంతో ఆయన బయటపడ్డారని సమాచారం.
రతుల్‌ను కొన్ని ఆధారాలతో ప్రశ్నించాలని భావించామని... కానీ ఆయన వెళ్లిపోయిన కారణంగా కుదరలేదని ఈడీ అధికారులు తెలిపారు. రతుల్‌ను వెనక్కి రప్పించేందుకు ఫోన్ చేయగా అతడి చరవాణిని స్విచ్చాఫ్ చేశారని సమాచారం.
నాటకీయంగా ఈడీ కార్యాలయం నుంచి బయటపడిన రతుల్ దిల్లీ కోర్టును ఆశ్రయించి.... అరెస్ట్ నుంచి మినహాయింపు కోరారు. సోమవారం వరకు ఆయన్ను అరెస్టు చేయరాదని కోర్టు ఈడీని ఆదేశించింది.