తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుఖోయ్​లో స్పైస్​ బాంబులు! - స్పైస్

సుఖోయ్​-30 యుద్ధవిమానాల్లో స్పైస్​-2000 బాంబు​లను వాడేందుకు భారత వాయుసేన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్​ బాలాకోట్​ వాయుసేన దాడిలోనూ సుఖోయ్​లో స్పైస్​ బాంబులను వినియోగించినట్లు ఐఏఎఫ్​ తెలిపింది.

సుఖోయ్​-30 యుద్ధవిమానం

By

Published : Mar 5, 2019, 10:00 PM IST

యుద్ధవిమానాలను ఆధునీకరించేందుకు భారత వాయుసేన నడుం బిగించింది. ఇజ్రాయెల్​కు చెందిన స్పైస్​-2000 బాంబులను సుఖోయ్​ యుద్ధవిమానాల్లో అమర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం పాకిస్థాన్​ బాలాకోట్​ వాయుదాడిలో దీన్ని పరీక్షించింది ఐఏఎఫ్.

ప్రస్తుతానికి మిరాజ్​-2000లోనే స్పైస్​ బాంబులను వాడగలుగుతున్నాం. ఐఏఎఫ్​ వద్ద 250 మిరాజ్​ యుద్ధ విమానాలు ఉన్నాయి. కేవలం 3 స్క్వాడ్రన్ల పరిధిలోనే మిరాజ్​ సేవలందిస్తోంది. వచ్చే ఏడాదిలో మరో 20 యుద్ధవిమానాలు చేరుతాయి.

సుఖోయ్​లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించగలిగితే వాయుసేనకు మరింత బలం చేకూరుతుంది. మరికొన్ని పరీక్షల తర్వాత సుఖోయ్​-30 శ్రేణిలో స్పైస్​లను అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

ఇజ్రాయెల్​ నుంచి 200కు పైగా స్పైస్​-2000 బాంబులను కొనుగోలు చేసింది భారత్. ఉపగ్రహ చిత్రాలు, అక్షాంక్షాల స్థానం ఆధారంగా లక్ష్యాన్ని సమర్థంగా ఛేదిస్తాయి స్పైస్​ బాంబు​లు.

ABOUT THE AUTHOR

...view details