ఎప్పుడు ఉద్రిక్తతలు తలెత్తే అంశాన్ని అంచనా వేయలేమని, కానీ రక్షణదళాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాయన్నారు త్రిదళాధిపతి బిపిన్ రావత్. తమిళనాడు తంజావూరులోని 'టైగర్‌షార్క్స్' వైమానిక స్థావరం వేదికగా వాయు దళాధిపతి ఆర్కేఎస్ బదౌరియాతో కలిసి సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలను వాయుసేనలో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ ఛైర్మన్ జి. సతీశ్‌రెడ్డి హాజరయ్యారు.
తంజావూరు వైమానిక స్థావరంలో మోహరించిన సుఖోయ్ 30 ఎంకేఐ శ్రేణి యుద్ధ విమానాలు సముద్రతలాన్ని పర్యవేక్షించనున్నాయి.