తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అశ్రునయనాల మధ్య సుజిత్​కు తుది వీడ్కోలు - సుజిల్​ ఇక లేడు

తమిళనాడులో బోరుబావిలో పడ్డ బాలుడు సుజిత్​ను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు విఫలమయ్యాయి. బాలుడి మృతదేహాన్ని వెతికి తీశారు అధికారులు. అనంతరం.. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.

మృత్యువుతో పోరాడి తిరిగిరాని లోకాలకు 'సుజిత్'

By

Published : Oct 29, 2019, 5:49 AM IST

Updated : Oct 29, 2019, 12:46 PM IST

అశ్రునయనాల మధ్య సుజిత్​కు తుది వీడ్కోలు

తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు సుజిత్ మృతి చెందాడు. మూడు రోజులుగా నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగించిన అధికారులు.. సుజిత్​ మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా నిమిత్తం భౌతికకాయాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం... అశ్రునయనాల మధ్య సుజిత్​కు తుది వీడ్కోలు పలికారు.

ఈ నెల 25న సుజిత్ ఆడుకుంటూ బోరుబావిలో పడిపోగా దానికి సమాంతరంగా 60 అడుగులకు పైగా లోతు బావిని తవ్వారు. ఈ తరుణంలో పెద్ద బండరాళ్లు, వర్షం అడ్డుగా వచ్చాయి. ఈ ఆటంకాలన్నీ అధిగమించి బాలుడుని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసిన సహాయసిబ్బంది.. చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. సుజిత్ ప్రాణాలతో బోరుబావి నుంచి బయటపడాలంటూ ప్రధాని మోదీ సహా సామాన్య ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఆ బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

ఇదీ చూడండి : సుజిత్​ కోసం ప్రార్థనలు.... నిర్విరామంగా సహాయక చర్యలు

Last Updated : Oct 29, 2019, 12:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details