తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైకత శిల్పి సుదర్శన్​కు అంతర్జాతీయ పురస్కారం

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​ను ప్రతిష్టాత్మక ఇటాలియన్​ గోల్డెన్​ సాండ్​ ఆర్ట్​ అవార్డు 2019 వరించింది. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ ట్విట్టర్​ వేదికగా సుదర్శన్​ను అభినందించారు.

సైకత శిల్పి సుదర్శన్​కు అంతర్జాతీయ పురస్కారం

By

Published : Nov 2, 2019, 2:43 PM IST

Updated : Nov 2, 2019, 11:33 PM IST

సైకత శిల్పి సుదర్శన్​కు అంతర్జాతీయ పురస్కారం

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్ ప్రతిష్టాత్మక ఇటాలియన్ గోల్డెన్ సాండ్ ఆర్ట్ అవార్డు 2019కు ఎంపికయ్యారు. ఇటలీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సాండ్​ నేటివిటీ కార్యక్రమంలో సుదర్శన్ ఈ పురస్కారం అందుకోనున్నారు.

నవంబరు 13 నుంచి 18 వరకు ఈ వేడుక జరగనుంది. ఎనిమిది మంది శిల్పులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో పట్నాయక్​ భారత్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ అవార్డుకు ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉందని పట్నాయక్​ తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ ట్విట్టర్​ వేదికగా సుదర్శన్​కు అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి : 'మహారాష్ట్రలో నవంబర్​ 7 తరువాత రాష్ట్రపతి పాలన!'

Last Updated : Nov 2, 2019, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details