తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆదర్శం: 'భిక్షాటన కంటే ఇదే ఉత్తమం' - స్ఫూర్తి

థర్డ్​ జెండర్.​.. డబ్బుల కోసం దౌర్జన్యం చేస్తారని, ఇతరులను ఇబ్బంది పెడతారని భావిస్తాం. బతకడం కోసం అక్రమ వ్యాపారాలు చేస్తారని అసహ్యించుకుంటారు కొందరు. అయితే అందుకు మేం మినహాయింపు అంటున్నారు కర్ణాటకలోని కొందరు ట్రాన్స్​జెండర్లు. గౌరవంగా బతికేందుకు వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ట్రాన్స్​జెండర్లు

By

Published : Jun 13, 2019, 7:32 AM IST

వ్యవసాయాన్ని ఆదాయ వనరుగా చేసుకున్న ట్రాన్స్​జెండర్లు

రైళ్లు, బస్టాండ్​లలో అక్రమంగా డబ్బులు వసూలు చేసే థర్డ్​ జెండర్స్​ మాత్రమే మనకు తెలుసు. మేమూ గౌరవంగా బతకగలమని నిరూపిస్తున్నారు కర్ణాటక చిక్కమగళూరులోని ఓ థర్డ్​ జెండర్ల బృందం. అందుకు వ్యవసాయాన్ని ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. మిశ్రమ పంటలు వేస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు.

చిక్కమగళూరు జిల్లాలోని హులి తిమ్మాపురలో నివాసముంటున్నారు మేఘ మల్నాడ్​, స్ఫూర్తి దంపతులు. వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోకముందు వీళ్లంతా భిక్షాటన చేసేవారు. గౌరవంగా బతకాలన్న ఆలోచనతో కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం ప్రారంభించారు.

"వ్యవసాయం చేసి జీవించాలని మేం భావించాం. తల్లిదండ్రులు మాకిచ్చిన డబ్బుతో పాటు మరికొంత రుణం తీసుకున్నాం. 4.5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాం. సెక్స్ వర్కర్​, భిక్షాటన చేయటం కన్నా ఇదెంతో ఉత్తమం."

-స్ఫూర్తి, థర్డ్​ జెండర్​

వీళ్లు మొక్కజొన్న, టమాట, బంగాళా దుంప తదితర పంటలను పండిస్తున్నారు. సాగుతో పాటు పాడిని పెంచుతున్నారు. మొదటగా వ్యవసాయంపై అవగాహన లేక తొలుత ఇబ్బంది పడ్డారు. కొన్ని రోజులు వ్యవసాయ కూలీలుగా పని చేసి అనుభవం గడించి విజయవంతం అయ్యారు.

ఇదీ చూడండి:నిరసనలతో హోరెత్తిన హాంగ్​కాంగ్​ వీధులు

ABOUT THE AUTHOR

...view details