భాజపా ఐటీ విభాగానికి, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి మధ్య వివాదం ముదురుతోంది. ఐటీ విభాగం హద్దు మీరి తనపై దాడి చేస్తోందని ఇటీవలే ఆరోపించారు స్వామి. తాజాగా ఇదే విషయంపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అల్టిమేటం జారీ చేశారు. గురువారంలోగా ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియాను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మహాభారతంలో శ్రీ కృష్ణుడు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు.
"రేపటి కల్లా మాల్వియాను భాజపా ఐటీ సెల్ నుంచి తొలగించాలి(ఇది నడ్డాకు.. నా ఐదు గ్రామాల రాజీ ప్రతిపాదన). ఒకవేళ అది జరగకపోతే.. పార్టీ నావైపు ఉండాలనుకోవడం లేదని అర్థం. ఆ సందర్భంలో.. నాకు నేనే మద్దతుగా నిలవాల్సి ఉంటుంది."
--- సుబ్రహ్మణ్య స్వామి, రాజ్యసభ ఎంపీ.