తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జనవరి 1న డీసీజీఐ బృందం భేటీ- టీకా డేటా విశ్లేషణ - corona vaccine in india

ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు కరోనా టీకా అత్యవసర అనుమతి కోసం చేసిన విజ్ఞప్తులను కేంద్రం పరిశీలిస్తోంది. సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు అందించిన అదనపు సమాచారాన్ని నిపుణులు విశ్లేషించారు. నిపుణుల బృందం జనవరి 1న మరోసారి భేటీ అవుతుందని డీసీజీఐ తెలిపింది.

Subject Expert Committee (SEC) in Central Drugs Standard Control Organisation (CDSCO) met today
జనవరి 1న డీసీజీఐ బృందం భేటీ- టీకా డేటా విశ్లేషణ

By

Published : Dec 30, 2020, 8:45 PM IST

Updated : Dec 30, 2020, 9:12 PM IST

కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం విజ్ఞప్తులను కేంద్రం పరిశీలించింది. ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థల విజ్ఞప్తులపై డ్రగ్‌ కంట్రోలర్‌ అథారిటీ నిపుణుల బృందం చర్చించింది. అదనపు సమాచారం ఇచ్చేందుకు ఫైజర్​ సంస్థ కొంత సమయం కోరింది. సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు అందించిన అదనపు సమాచారాన్ని నిపుణులు విశ్లేషించారు.

ఈ రెండు సంస్థలు ఇచ్చిన సమాచారం, డేటా విశ్లేషణ కొనసాగుతోందని డీసీజీఐ తెలిపింది. నిపుణుల బృందం జనవరి 1న మరోసారి భేటీ అవుతుందని తెలిపింది.

Last Updated : Dec 30, 2020, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details