తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కాలంలోనూ అక్కడ పదో తరగతి పరీక్షలు - KA 10th class exam news

కరోనా భయంతో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. అయితే పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పే ఎస్​ఎస్​ఎల్​సీ పరీక్షలను రద్దుచేసే అవకాశంలేదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకే తగ్గట్లుగానే నేడు పరీక్షలను ప్రారంభించింది.

Students writing their Secondary School Leaving Certificate (SSLC) exams in karnataka
కరోనా కాలంలోనూ కర్ణాటకలో పదో తరగతి పరీక్షలు

By

Published : Jun 25, 2020, 2:44 PM IST

కరోనా కారణంగా వాయిదాపడ్డ పదో తరగతి పరీక్షలు.. కర్ణాటక వ్యాప్తంగా గురువారం ప్రారంభమయ్యాయి. అన్ని పకడ్బందీ ఏర్పాట్లతో, తగినన్ని జాగ్రత్తలతో నిర్వహిస్తోన్న ఈ పరీక్షలు జులై 4 వరకు జరగనున్నాయి.

కర్ణాటక సెకండరీ ఎడ్యుకేషన్​ ఎగ్జామినేషన్​ బోర్డ్​(కేఎస్​ఈఈబీ) అధ్వర్యంలో జరిగే పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 8,48,203 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరికోసం 2,879 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ పోలీసు బందోబస్తు సహా.. ఆరోగ్య కార్యకర్తలను, రవాణా శాఖాధికారులను అందుబాటులో ఉంచారు.

కట్టుదిట్టమైన చర్యలు
శానిటైజింగ్​
పరీక్ష నిర్వహణ గది

నిబంధనలు తప్పనిసరి..

విద్యార్థులు భౌతికదూరం పాటించేలా అవసరమైన చర్యలు చేపట్టిన అధికారులు.. ఒక్కో గదిలో 18 నుంచి 20 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి కల్పించారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు థర్మల్​ స్క్రీనింగ్​ సహా.. చేతులను శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

హాాల్​ టికెట్​ నంబర్ చూసుకుంటున్న విదార్థులు
పరీక్షా కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సురేశ్​ కుమార్​

ప్రతిపక్షాలు వద్దన్నా..

రాష్ట్రంలో పరీక్షలు వద్దని ప్రతిపక్షాలు విన్నవించినా యడియూరప్ప సర్కారు ముందడుగు వేసింది. విద్యార్థుల జీవితంలో పదో తరగతి పరీక్షలు చాలా కీలకమని, అందుకే పకడ్బందీ ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:కార్పొరేటర్​ సాహసం- నగర ప్రజల ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details