తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కంటెయిన్​మెంట్​ జోన్లలో పరీక్ష కేంద్రాలొద్దు - విద్యాసంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు

కరోనా వేళ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు ఈ నెలాఖరులోపు తుది పరీక్షలు నిర్వహించేందుకు యూజీసీ గడువు విధించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కంటెయిన్​​మెంట్ జోన్లలో పరీక్ష కేంద్రాలు పెట్టొద్దని ఆదేశించింది. కంటెయిన్​​మెంట్​ జోన్ల నుంచి వచ్చే విద్యార్థులు, సిబ్బందిని లోనికి అనుమతించొద్దని తెలిపింది. ఆ విద్యార్థులకు వేరే మార్గాల ద్వారా పరీక్షలు రాసేందుకు అనుమతివ్వడమో, లేదంటే తదుపరి పరీక్షలు రాసేందుకు అనుమతివ్వడమో, తదుపరి తేదీల్లో పరీక్షలు నిర్వహించడమో చేయాలని స్పష్టం చేసింది.

No Examination centers in containment zones
పరీక్షల నిర్వహణకు కేంద్రం మర్గదర్శకాలు

By

Published : Sep 3, 2020, 11:16 AM IST

దేశంలోని అన్ని విద్యాసంస్థలు ఈ నెల 30 లోపు తుది సంవత్సరం/సెమిస్టర్​ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ గడువు విధించిన నేపథ్యంలో ఈ సందర్భంగా అనుసరించాల్సిన ప్రమాణాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం జారీచేసింది. ఈనెలలో జేఈఈ మెయిన్​, నీట్​ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉండటంతో వీటిని విడుదల చేసింది.

పరీక్షల నిర్వహణ సమయంలో అడుగడుగునా భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని నిర్దేశించింది. కంటెయిన్​మెంట్​ జోన్లలో పరీక్షా కేంద్రాలు వద్దని, కంటెయిన్​మెంట్​ జోన్లలోని సిబ్బంది, విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించకూడదని స్పష్టం చేసింది. అలాంటి విద్యార్థులకు వేరే మార్గాల ద్వారా పరీక్షలు రాసేందుకు అనుమతివ్వడమో, లేదంటే తదుపరి పరీక్షలు రాసేందుకు అనుమతివ్వడమో, లేదంటే తదుపరి తేదీల్లో పరీక్షలు నిర్వహించడమో చేయాలని స్పష్టం చేసింది.

  • పరీక్షా కేంద్రాల వద్ద జనం పోగవకుండా దశలవారీగా పరీక్షలు నిర్వహించేలా యూనివర్సిటీలు/ విద్యాసంస్థలు/పరీక్షా నిర్వహణ అధికారులు ప్రణాళికలు రూపొందించాలి.
  • భౌతిక దూరం నిబంధనల మేరకు విద్యార్థుల మధ్య దూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేయాలి. గదుల సామర్థ్యం ఇందుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
  • అవసరానికి తగ్గట్లు ఫేస్​కవర్లు/మాస్కులు, శానిటైజర్​, సబ్బు, హైపోక్లోరైట్​ సొల్యూషన్​ లాంటి వాటిని ఏర్పాటు చేయాలి.
  • పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టేటప్పుడు తమ ఆరోగ్య స్థితి గురించి పర్యవేక్షకులు, విద్యార్థులు స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి. అడ్మిట్​ కిట్లు జారీచేసేటప్పుడే ఈ స్వీయ ధ్రువీకరణ పత్రం, పాటించాల్సిన, పాటించకూడని నిబంధనలు కూడా విద్యార్థులకు పంపిణీ చేయాలి.
  • పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు అడ్మిట్​ కార్డుతో సహా తెచ్చుకోవాల్సిన గుర్తింపుకార్డులు, ఫేస్​ మాస్క్​, నీళ్ల సీసాలు, హ్యాండ్​ శానిటైజర్ల గురించి విద్యార్థులకు ముందే సమాచారం అందించాలి.
  • భౌతిక నిబంధనలు పాటించడానికి అనుగుణంగా తగిన సంఖ్యలో రిజిస్ట్రేషన్​ గదులు, దస్తావేజుల పరిశీలన, అటెండెన్స్​ చూసుకోవడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలి.
  • కొవిడ్​ నేపథ్యంలో పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి గురించి పర్యవేక్షణ సిబ్బందికి ముందే తర్ఫీదు ఇవ్వాలి.
  • కొవిడ్​-19 నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించే పోస్టర్లు, వీడియోలను పరీక్షాకేంద్రంల లోపల, బయట ప్రదర్శించాలి.
  • ప్రవేశ సమయంలో స్క్రీనింగ్​ చేసేటప్పుడు ఎవరిలోనైనా కొవిడ్​ లక్షణాలు కనిపిస్తే వెంటనే వేరుగా కూర్చోబెట్టడానికి ప్రత్యేక ఏకాంత గది ఏర్పాటుచేయాలి. వైద్య సలహా తీసుకొనేంతవరకు వారిని అందులో ఉంచాలి.

ప్రవేశం-నిష్క్రమణ

  • పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు అందర్నీ థర్మల్​ స్క్రీన్​ చేయాలి. తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆరోగ్యం గురించి స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వని సిబ్బందిని గానీ, విద్యార్థిని గానీ లోపలికి అనుమతించకూడదు.
  • కొవిడ్​ లక్షణాలు కనిపించిన విద్యార్థులను సమీప ఆరోగ్య కేంద్రానికి పంపాలి. వారు వేరే విధానం ద్వారా పరీక్షలు రాసేలా చూడాలి.
  • ఒకవేళ విద్యార్థిలో లక్షణాలు బయటపడిన తర్వాత కూడా పరీక్ష రాస్తానని పట్టుబడితే ప్రత్యేక ఏకాంతగదిలోకి మారిన తర్వాతే అనుమతించాలి.
  • మాస్క్​/ఫేస్​కవర్​ ధరించిన సిబ్బంది, విద్యార్థులకే అనుమతివ్వాలి. పరీక్ష కేంద్రంలోకూడా అందరూ పరీక్షలు జరుగుతున్నంతసేపూ వాటిని ధరించే ఉండాలి.
  • థర్మల్​ స్క్రీనింగ్​ తర్వాత విద్యార్థులను తనిఖీ(ఫ్రిస్కింగ్​)చేసే సిబ్బంది తప్పనిసరిగా త్రిపుల్​ లేయర్​ మెడికల్​ మాస్క్​, చేతికి తొడుగులు ధరించాలి.
  • ేతి తొడుగులు మార్చుకున్న ప్రతిసారీ చేతులు తగిన విధంగా శుభ్రం చేసుకోవాలి.
  • పరీక్ష పూర్తయిన 72 గంటల తర్వాత సమాధాన పత్రాలను తెరవడం మంచిది.
  • పరీక్షా కేంద్రంలో విద్యార్థుల మధ్య వ్యక్తిగత వస్తువుల పంపిణీ జరగకుండా చూడాలి.
  • ఏసీలు 24-30 డిగ్రీల మధ్యే నిర్వహించాలి. గదిలో తేమశాతం 40-70% ఉండేలా చూసుకోవాలి.

ఇదీ చూడండి:మోదీ ఖాతా హ్యాక్​- అంగీకరించిన ట్విట్టర్

ABOUT THE AUTHOR

...view details