జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దిల్లీలో వందలాది మంది విద్యార్థులు మండీ హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దిల్లీలో విద్యార్థుల ర్యాలీ - సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దిల్లీలో విద్యార్థుల ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు మండీ హౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు.
సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దిల్లీలో విద్యార్థుల ర్యాలీ
సీఏఏ, ఎన్ఆర్సీలను నిషేధించాలని మాస్కులు ధరించి కవాతు నిర్వహించారు. జేఎన్‌యూ మాజీ విద్యార్థులు సైతం ఈ నిరసనల్లో పాల్గొన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టం అమలును వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికే తాము నిరసనలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: కోర్టు బయట రాజ్యాంగ పీఠిక చదివిన లాయర్లు.. కారణమిదే!
Last Updated : Feb 17, 2020, 6:06 PM IST