తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నింగిలోకి విమానాలు- దేశీయ సర్వీసులు షురూ - దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం

దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దిల్లీ-పుణె, ముంబయి-పట్నా విమాన సర్వీసులు మొదటిగా ప్రారంభమయ్యాయి. వీటిలో పారామిలటరీ సిబ్బంది, సైనికులు, విద్యార్థులు, వలసదారులు... తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.

Students, migrants take the first flight home after being grounded for weeks due to lockdown
ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు

By

Published : May 25, 2020, 8:11 AM IST

Updated : May 25, 2020, 8:46 AM IST

లాక్​డౌన్​ వల్ల రెండు నెలలుగా నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులు ఈరోజు నుంచి గ్రేడెడ్​ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. దీనితో తమ స్వస్థలాలకు, పని ప్రదేశాలకు చేరుకోవడానికి వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలకు చేరుకున్నారు.

సోమవారం ముందుగా దిల్లీ-పుణె, ముంబయి-పట్నా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వీటిని ఇండిగో సంస్థ నడుపుతోంది. అలాగే స్పైస్​జెట్​ నడిపే ఓ దేశీయ విమానం అహ్మదాబాద్ ​నుంచి దిల్లీ విమానాశ్రయానికి రానుంది.

పారామిలటరీ సిబ్బంది, సైనికులు, విద్యార్థులు, వలసదారులు... ఇవాళ పయనమవుతున్న తొలి విమానాల్లో బయలుదేరారు. నిజానికి వీరిలో ఎక్కువ మంది భారతీయ రైల్వే నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో టికెట్టు దొరకక స్వస్థలాలకు చేరుకోలేకపోయినవారే.

ఇబ్బంది తప్పలేదు..

ప్రజా రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవడం కాస్త ఇబ్బంది పడ్డారు.

కరోనా సంక్షోభం కారణంగా మార్చి 25న విమాన సర్వీసులు నిలిపివేశారు.

దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
థర్మల్ స్కానింగ్​
గగనసఖులు
మాస్కులు ధరించిన విమాన ప్రయాణికులు

ఇదీ చూడండి:కరోనా చికిత్సపై అస్పష్టతకు కారణమేంటి?

Last Updated : May 25, 2020, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details