తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కళాశాలకు వెళ్లాలంటే సాహస యాత్ర తప్పదు! - ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్​ పితోర్​గఢ్​ జిల్లా గోరిపుర్​ ప్రాంతంలోని మారుమూల గ్రామాల విద్యార్థులకు నిత్యం ఓ సాహస యాత్ర చేయాల్సిన పరిస్థితులు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి దారులన్నీ మూసుకుపోవడమే ఇందుకు కారణం.

కళాశాలకు వెళ్లాలంటే సాహస యాత్ర తప్పదు!

By

Published : Jul 18, 2019, 11:02 AM IST

కళాశాలకు వెళ్లాలంటే సాహస యాత్ర తప్పదు!
ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్​లో వర్షాలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సమీప ఇళ్లపై బండరాళ్లు పడి పలువురు గాయపడ్డారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మారుమూల గ్రామాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి చేరుకోవాలంటే అంతే సంగతులు. కొండలు ఎక్కినంత సాహసం చేయక తప్పదు.

పితోర్​గఢ్​ జిల్లా గోరిపుర్​ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి పలు గ్రామాల మధ్య దారులు మూసుకుపోయాయి. బోథి విద్యార్థులు అవస్థలు అన్నీఇన్నీ కావు. పక్కనే ఉన్న ఉచైతీలోని కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థులు నిత్యం ఓ సాహసయాత్ర చేయాల్సి వస్తోంది. దారుల్లో విరిగిపడిన బండరాళ్లను దాటేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ప్రమాదకర ప్రయాణం చేస్తూ.. వారు చదువును కొనసాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details