విద్యార్థులు పైతరగతులకు వెళ్లాలంటే మనదేశంలో పరీక్షలు తప్పనిసరి. పరీక్షా కాలం వచ్చిందంటే రాత్రీపగలూ తేడా లేకుండా తెగ చదివేస్తారు. ప్రస్తుతం కరోనా వల్ల ఆ పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. కొవిడ్-19 దెబ్బకు విద్యాసంస్థలన్నీ దాదాపు మూడు నెలలుగా మూతపడే ఉన్నాయి. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు పది విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేయగా.. మహారాష్ట్ర ఏకంగా ఉన్నత విద్యార్థులకూ ఈ ఆఫర్ ఇచ్చింది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం పరీక్షల విషయంలో ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తమ జీవితం సందిగ్ధంలో పడిందని.. ఎగ్జామ్స్ రద్దు చేయాలని కొందరు యువత సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో..
పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతికి పంపాలని ఇటీవల నిర్ణయించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. అంతర్గత మార్కుల ఆధారంగా వారికి గ్రేడ్లు కేటాయించి పదో తరగతి సర్టిఫికెట్ అందజేయాలన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జులై 10 నుంచి పది పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తమిళనాడులో..