తమిళనాడు-కేరళ సరిహద్దులోని పాలక్కడ్ జిల్లాలో అదొక గిరిజన గ్రామం. ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యం ఏర్పడటం వల్ల.. అక్కడి విద్యార్థులకు సౌకర్యాలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే తన ఊరి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన అనామిక.. తానే ఉపాధ్యాయురాలిగా మారింది. ఆ విద్యార్థిని తల్లిదండ్రులూ ఆమెకు అండగా నిలవడం వల్ల.. వాళ్ల ఇంట్లోని ఓ గదిని విద్యాలయంగా మార్చి అక్కడే పేద పిల్లలకు విద్యనందిస్తోంది.
త్రివేండ్రంలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది అనామిక. జర్మన్, మలయాళం, తమిళం, ఇంగ్లీష్ భాషలను నేర్చుకుంటోంది. అయితే.. తన గ్రామ బాగోగులపై దృష్టి సారించిన ఈ బాలిక.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పిల్లలకు పాఠాలు చెబుతోంది.