తెలంగాణ

telangana

ETV Bharat / bharat

3వ తరగతి విద్యార్థికి 450 గుంజీల శిక్ష- టీచర్​పై కేసు - 3వ తరగతి విద్యార్థికి 450 గుంజీల శిక్ష- టీచర్​పై కేసు

3వ తరగతి చదివే చిన్నారి హోం వర్క్​ చేయలేదని 450 గుంజీలు తీయించిన ఘటన మహారాష్ట్ర ఠానేలో జరిగింది. విద్యార్థికి ఇంతటి కఠిన శిక్ష వేసిన ఉపాధ్యాయురాలిపై కేసు నమోదైంది.

Student, punished with 450 sit-ups, takes ill; teacher booked
3వ తరగతి విద్యార్థికి 450 గుంజీల శిక్ష- టీచర్​పై కేసు

By

Published : Jan 23, 2020, 12:51 PM IST

Updated : Feb 18, 2020, 2:42 AM IST

మహారాష్ట్ర ఠానేలో దారుణం జరిగింది. శాంతి నగర్ ప్రాంతంలో ఉండే ఓ ప్రైవేటు ట్యూషన్​ టీచర్ ​తన దగ్గరకు వచ్చే 3వ తరగతి విద్యార్థికి అత్యంత కఠిన శిక్ష విధించింది. హోం వర్క్​ చేయలేదని ఆగ్రహించి 450 గుంజీలు తీయించింది. రెండు కాళ్లు వాచి, నడవలేని స్థితిలో ఆ చిన్నారి ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

ట్యూషన్​ టీచర్​ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థి తల్లిదండ్రులు. ఆ ఉపాధ్యాయురాలు గతంలోనూ బాలికను వివస్త్రను చేసి, కర్రతో చితకబాదిందని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: ఆమె చదువుతోంది 'లా'.. పాములు పడుతోందిలా!

Last Updated : Feb 18, 2020, 2:42 AM IST

ABOUT THE AUTHOR

...view details