తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫిబ్రవరి 7న ఛలో పార్లమెంట్

మధ్యంతర బడ్జెట్​లో ఉద్యోగాలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహిస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం

By

Published : Feb 6, 2019, 5:42 AM IST

కేంద్ర మధ్యంతర బడ్జెట్​లో ఉద్యోగావకాశాలపై ప్రభుత్వం మౌనంగా ఉండటంపై ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 7న ఎర్రకోట నుంచి పార్లమెంటు వరకు ర్యాలీ నిర్వహిస్తామని వివిధ విద్యార్థి సంఘాలు సంయుక్తంగా ప్రకటించాయి.

"దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ పెరుగుతుంటే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవటం యువతకు పెద్ద ఎదురుదెబ్బ. నిరుద్యోగంతో పాటు ఇంకా అనేక అంశాలను బడ్జెట్​లో పేర్కొనలేదు. ఉద్యోగుల క్రమబద్దీకరణ, కనీస వేతన పెంపు లాంటి కీలక విషయాలను ప్రభుత్వం విస్మరించింది. మోదీ ప్రభుత్వ చర్యలతో విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు యుద్ధ రంగాల్లా మారుతున్నాయి. "
- విద్యార్థి సంఘాలు

ABOUT THE AUTHOR

...view details