ముంబయిలో 55 ఏళ్ల గిటార్ టీచర్ను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 10 ఏళ్ల క్రితం తనను లైంగిక వేధించాడని అమెరికా నుంచి వచ్చి మరీ కేసు పెట్టింది ఓ యువతి.
ఏం జరిగింది..?
పదేళ్ల క్రితం సంగీతం బోధించడానికి అంధేరిలోని విద్యార్థిని ఇంటికి వెళ్లిన గిటారు ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించేవాడని బాధితురాలు ఆరోపించింది. అప్పటికి ఆమె వయస్సు సుమారు తొమ్మిదేళ్లు. తర్వాత చిన్నారి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. సుమారు మూడేళ్ల (2007-2010) పాటు తనను లైంగికంగా వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఓ కళాశాలలో చదువుతున్నట్లు అధికారులు తెలిపారు.