తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాలుష్య నివారణ ఏకసభ్య కమిటీ రద్దు - National reginal capital news updates

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యానికి కారణమవుతున్న పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని నిలిపివేసింది సుప్రీంకోర్టు. కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం సమగ్ర చట్టం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.

Stubble burning: SC keeps in abeyance its Oct 16 order appointing Justice M B Lokur panel
కాలుష్య నివారణ ఏకసభ్య కమిటీ రద్దు

By

Published : Oct 26, 2020, 3:59 PM IST

దిల్లీలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న హరియాణా, పంజాబ్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహన నివారణ చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని రద్దు చేసింది సుప్రీంకోర్టు. కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్రం సమర్థమైన చట్టం తీసుకురానుందని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.

'కాలుష్యం వల్లే దిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇది తక్షణమే నివారించాల్సిన అవసరం ఉంది' అని ధర్మాసనం పేర్కొంది.

'కాలుష్య నివారణకు కేంద్రం సమర్థమైన చర్యలు తీసుకుంటోందని... దానికి సంబంధించి ప్రతిపాదిత డ్రాఫ్ట్​ను నాలుగు రోజుల్లో కోర్టు సమర్పిస్తాం' అని కోర్టుకు విన్నవించారు మెహతా.

పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాలు గుర్తించేందుకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్, భారత్ స్కౌట్స్ బృందాలను మెహరించాలని అక్టోబరు 16న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిని పర్యవేక్షించేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్​తో కూడిన ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి:పంట వ్యర్థాల దహన నివారణకు ఏకసభ్య కమిటీ

ABOUT THE AUTHOR

...view details