బిహార్ పట్నాలో భారీ వర్షపాతం నమోదైంది. వాన కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నంద కిషోర్ యాదవ్ ఇల్లు కూడా నీట మునిగింది.
బిహార్లోని పలు ప్రాంతాల్లో మరో 48 గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సివాన్, గోపాల్‌గంజ్, సీతామార్హి, దర్భాంగా, సుపాల్, అరియారియా, కిషన్గంజ్,కటిహార్‌లో ఉరుములు, మెరుపులు, విపరీతమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ బ్యూరో తెలిపింది.