వెలుగులు జిమ్మే పండుగ దీపావళి. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి భారీ ఎత్తున అన్ని చోట్లా టపాకాయలను కాల్చే అవకాశం ఉండకపోవచ్చు. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో బాణసంచాను తయారు చేస్తుండటం వల్ల పలు రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించాయి. కొవ్వొత్తులు, దీపాలు మాత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో వెలిగించకమానరు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తి 24 గంటలూ వెలిగే 'మాయా దీపాల'ను తయారు చేశాడు.
ఛత్తీస్‌గఢ్‌లో కుండలను తయారు చేసే ఓ వ్యక్తి తన ప్రతిభకు పదునుపెట్టాడు. మాటిమాటికీ దీపాల్లో నూనె అయిపోతే పోసుకుంటూ ఉండాలి. అయితే అలాంటి బాధను తీర్చేలా దాదాపు 24 గంటల నుంచి 40 గంటల వరకు ఎలాంటి ఆటంకం లేకుండా దీపాలు వెలిగేలా ప్రత్యేకంగా కుండీలను తయారు చేశాడు.