చారిత్రక సంఘటనలపై సమగ్ర, ప్రామాణిక, నిష్పాక్షిక సమాచారాన్ని రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని పాఠ్యపుస్తకాలలో స్వాతంత్ర్య సమరయోధుల శౌర్యం, త్యాగాల కథలను ప్రధానాంశంగా చేర్చాలని సూచించారు.
'నేతాజీ- ఇండియాస్ ఇండిపెండెన్స్ అండ్ బ్రిటీష్ ఆర్కైవ్స్' పుస్తకం విడుదల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య. ఈ పుస్తకాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్- ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) ట్రస్ట్ అసోసియేట్ సభ్యుడు కల్యాణ్ కుమార్ దే రచించారు.