కొవిడ్ వైరస్ సంక్రమణను నిరోధించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోగి తాకిన ఉపరితలాలను మరొకరు తాకడం ద్వారా వైరస్ విస్తరిస్తుండటంతో కోచ్‌లలో చేతులతో తాకాల్సిన అవసరం లేని ఏర్పాట్లకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన నమూనా కోచ్‌కు పంజాబ్‌లోని కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో రూపకల్పన చేసింది. కొళాయి, సోప్ డిస్పెన్సర్, మరుగుదొడ్డి తలుపులు, ఫ్లష్ వాల్వ్‌లు, వాష్ బేషిన్‌లను చేతితో తాకాల్సిన అవసరం లేకుండా పాదంతో నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
రైల్వే కోచ్‌లలో కరోనా నియంత్రణ ఏర్పాట్లు - steps to eradicate coronavirus on trains
కరోనా సంక్రమణను నియంత్రించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కొళాయి, సోప్ డిస్పెన్సర్, మరుగుదొడ్డి తలుపులు, ఫ్లష్ వాల్వ్‌లు, వాష్ బేషిన్‌లను చేతితో తాకాల్సిన అవసరం లేకుండా పాదంతో నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. అలాగే హానికర సూక్ష్మ జీవులను సంహరించేందుకు ప్రతి కోచ్ లోపలి భాగాలకు టైటానియం డైయాక్సైడ్ కోటింగ్ వేశారు.
అలాగే వైరస్ కట్టడిలో భాగంగా ప్రతి చోటా రాగి హ్యాండిల్స్‌ని ఏర్పాటు చేసింది. రాగిలోని అయాన్లు వైరస్‌ను నాశనం చేస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. ఏసీ ద్వారా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు ఏసీ డక్ట్‌లో ప్లాస్మా ఎయిర్ ప్యూరిఫికేషన్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. అది కోచ్‌లోని గాలిని, రైల్లోని ఉపరితలాలను శుభ్రం చేస్తుంది. అలాగే కోచ్ లోపల అన్ని భాగాలపై టైటానియం డయాక్సైడ్ కోటింగ్ చేశారు. ఈ కోటింగ్ హానికర సూక్ష్మ క్రిములను సంహరిస్తుంది. దీని ప్రభావం 12 నెలలపాటు ఉంటుందని, ఫలితంగా ఎక్కడా వైరస్ వృద్ధి చెందే అవకాశం ఉండదని రైల్వేశాఖ వివరించింది.
ఇదీ చూడండి:నేడు ప్రపంచ యువతా నైపుణ్య దినోత్సవం.. మోదీ ప్రత్యేక సందేశం