తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పీఎం నరేంద్ర మోదీ'​పై 8న విచారణ

'పీఎం నరేంద్ర మోదీ' చిత్రం విడుదలను వాయిదా వేయాలన్న పిటిషన్​పై​ విచారణకు సుప్రీం కోర్టు అనుమతించింది. ఈ నెల 8న విచారణ చేపడతామని జస్టిస్​ ఎస్​.ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

పీఎం నరేంద్ర మోదీ'​పై 8న సుప్రీం విచారణ

By

Published : Apr 4, 2019, 12:56 PM IST

Updated : Apr 4, 2019, 1:56 PM IST

'పీఎం నరేంద్ర మోదీ'​పై 8న విచారణ
'నరేంద్ర మోదీ' సినిమా విడుదల వాయిదా వేయాలన్న కాంగ్రెస్​ నేత పిటిషన్​పై​ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ నెల 8న విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఏ.బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

సినిమా విడుదలలో జోక్యం చేసుకోలేమని ఇప్పటికే రెండు హైకోర్టులు పేర్కొన్నట్లు పిటిషనర్​ తరఫు న్యాయవాది ఏఎమ్​ సింఘ్వీ తెలిపారు. ఈ చిత్రం విడుదలతో రానున్న ఎన్నికలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

వివేక్​ ఒబెరాయ్​ నటించిన ఈ సినిమాను ఏప్రిల్​ 5న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం విడుదల కొన్ని రోజులు వాయిదా పడిందని తెలుస్తోంది.

మధ్యప్రదేశ్​ హైకోర్టు కూడా 'పీఎం నరేంద్ర మోదీ' సినిమా విడుదలను వాయిదా వేయాలన్న పిటిషన్​ను తిరస్కరించింది. ఇదే చిత్రంపై మరో పిటిషన్​ను ముంబయి హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది.

Last Updated : Apr 4, 2019, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details