తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ దేశాల పనిబడితేనే ఉగ్రవాదం అంతం'

ఉగ్రవాదం మూలాలు తెలుసుకుంటేనే దానిని పూర్తిగా అంతమొందించగలమన్నారు సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్​. తీవ్రవాదంపై అంతర్జాతీయ యుద్ధం ప్రకటించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దిల్లీలో జరుగుతున్న రైసీనా సదస్సులో పాల్గొన్నారు త్రిదళాధిపతి రావత్.

Chief of Defence Staff Gen Rawat
'ఆ దేశాల పనిబడితేనే ఉగ్రవాదం అంతం'

By

Published : Jan 16, 2020, 12:46 PM IST

తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై అంతర్జాతీయంగా కఠిన చర్యలు తీసుకోవాలని త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్ రావత్‌ ఉద్ఘాటించారు. తీవ్రవాదాన్ని మూలాల నుంచి అంతం చేయాలని సూచించారు.

దిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్‌ మూడో రోజు సమావేశంలో పాల్గొన్నారు రావత్. తీవ్రవాదంపై పోరు కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ముష్కర మూకలను ప్రోత్సహించే దేశాలను ఏకాకిని చేయాలన్నారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. తాలిబన్లు ఆయుధాలు విడిచిపెట్టిన తర్వాతే వారితో చర్చలు జరపాలని అభిప్రాయపడ్డారు రావత్.

మీడియాతో మాట్లాడుతున్న బిపిన్​ రావత్​

"తీవ్రవాదంపై పోరుకు ముగింపు లేదు. మూలాలను తెలుసుకునేంత వరకు ఉగ్రవాదంపై పోరు కొనసాగుతూనే ఉంటుంది. మద్దతు ఉన్నంత కాలం తీవ్రవాదం ఉంటుంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, స్వప్రయోజనాల కోసం వాడుకునే దేశాలు ఉన్నంత కాలం మనం దానిని నియంత్రించలేం. 9/11 దాడుల తర్వాత అమెరికా అనుసరించిన మార్గాలతో మాత్రమే ఉగ్రవాదాన్ని అంతం చేయగలం. తీవ్రవాదంపై అంతర్జాతీయ యుద్ధం ప్రకటించాలి. ఉగ్రభూతంపై ఉమ్మడిపోరుకు అన్ని దేశాలు కలిసిరావాలి. అలా జరగాలంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను ఏకాకిని చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరులో తీవ్రవాదులను ప్రోత్సహించేవారు ఎన్నటికీ భాగస్వామ్యం కాలేరు."

-బిపిన్ రావత్​, సీడీఎస్​.

ఇదీ చూడండి: 'నోట్లపై లక్షీదేవి ఉంటే 'రూపాయి' చల్లగా ఉంటుంది'

ABOUT THE AUTHOR

...view details