తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై యుద్ధం: 12.7 లక్షల మందికి టీకా

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఏడో రోజూ విజయవంతంగా కొనసాగింది. మొత్తంగా శుక్రవారం సాయంత్రం వరకు 12లక్షలకు పైగా టీకా ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఒక్క శుక్రవారం రోజే(సాయంత్రం 6 గంటల వరకు) 2లక్షల మందికి పైగా లబ్దిదారులకు వ్యాక్సిన్​ ఇచ్చినట్లు వెల్లడించింది.

State wise list of Vaccination of 12.7 lakh people
12.7లక్షల మందికి టీకా.. రాష్ట్రాలవారీ జాబితా

By

Published : Jan 23, 2021, 12:19 AM IST

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఏడో రోజూ విజయవంతంగా కొనసాగినట్టు కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రోజున సాయంత్రం 6గంటల వరకు 2,28,563 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12.7లక్షల మందికి టీకా పంపిణీ జరిగినట్లు వెల్లడించింది.

12.7లక్షల మందికి టీకా.. రాష్ట్రాలవారీ జాబితా

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఇప్పటి వరకు ఏపీలో 1,27,726 మంది; తెలంగాణలో 1,02,724 మంది టీకా వేయించుకున్నారు. అత్యధికంగా కర్ణాటకలో 1,82,503 మంది టీకా వేయించుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియలో ఏడోరోజు 267 మందిలో ప్రతికూల ప్రభావం కనిపించినట్టు కేంద్రం తెలిపింది.

ఇదీ చూడండి:తల్లిదండ్రుల్ని పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో కోత!

ABOUT THE AUTHOR

...view details