భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. మహాలో కొత్తగా 18,317మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 481 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13 లక్షల 84 వేలు దాటింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 31 వరకు లాక్డౌన్ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు అక్టోబరు 5 నుంచి... 50 శాతం సామర్థ్యంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.
కేరళలో రికార్డు..
కేరళలో రికార్డు స్థాయిలో 8,830 కేసులు నమోదయ్యాయి. మరో 23మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య లక్షా 28 వేలు దాటింది.
- తమిళనాడులో కొత్తగా 5,659 మంది వైరస్ బారిన పడగా.. మరో 67 మంది చనిపోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 5 లక్షల 97వేలు దాటింది.
- దిల్లీలో తాజాగా 3,390మందికి వైరస్ సోకింది. 41మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 79వేల 715కు చేరింది.
- రాజస్థాన్‌లో ఒక్కరోజే 2,173 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 15 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య లక్షా 35వేలు దాటింది.