దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రలో తాజాగా 24,619 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 11,45,840కు చేరింది. కొవిడ్‌తో మరో 398 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 31,351కి ఎగబాకింది. అయితే పెరుగుతున్న వైరస్ కేసులకు అనుగుణంగా.. ఇప్పటివరకు 40లక్షల మందికిపైగా వైరస్‌ను జయించడం ఉపశమనం కలిగించే అంశం.
'మహా'పై కొవిడ్ విధ్వంసం-కొత్తగా 24,619 కేసులు - Covid-19 deaths in India
దేశంలో కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో తాజాగా 24వేల 619 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 398 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఒక్కరోజే 9,366 కరోనా కేసులు వెలుగుచూశాయి. అయితే.. పెరుగుతున్న కేసులకుతోపాటు.. రికవరీల సంఖ్య 40లక్షలు దాటడం ఊరటనిస్తోంది. యాక్టివ్ కేసులకంటే ఈ సంఖ్య 30,15,103 అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కర్ణాటకలో కొత్తగా 9,366 మందికి వైరస్
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు..
- కర్ణాటకలో తాజాగా 9,366 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4,94,356కు పెరిగింది. వైరస్ బారినపడిన వారిలో కొత్తగా 93మంది చనిపోగా.. మరణాల సంఖ్య 7,629కు చేరింది.
- తమిళనాట గురువారం ఒక్కరోజే 5,560 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 5,25,420కు ఎగబాకింది. కొత్తగా 59 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 8,618కి చేరింది.
- దిల్లీలో ఇవాళ 4,432 మందికి వైరస్ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 2,34,701కు పెరిగింది. వైరస్‌తో మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశరాజధానిలో 4,877 మంది చనిపోయారు.
- బంగాల్లో కొత్తగా 3,197 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. కేసుల సంఖ్య 2,15,580కి చేరింది. మహమ్మారితో కారణంగా మరో 60 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 4,183కు పెరిగింది.
- కేరళలో మరో 4,531 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో పదిమంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు.
- పంజాబ్‌లో తాజాగా 2,896 మందికి మహమ్మారి సోకగా.. బాధితుల సంఖ్య 90,032కు ఎగబాకింది. వైరస్ ధాటికి మరో 57 మంది బలవ్వగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,646కు చేరింది.
- హరియాణాలో కొత్తగా 2,457 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,03,773కు చేరింది. మరో 24 మరణాలతో.. మృతుల సంఖ్య 1,069కు ఎగబాకింది.
- మధ్యప్రదేశ్‌లో 2,391 కొత్త కేసులు బయటపడగా.. బాధితుల సంఖ్య లక్షకు సమీపించింది. మహమ్మారితో మరో 33మంది చనిపోగా.. మరణాల సంఖ్య 1,877కు చేరింది.
- జమ్ముకశ్మీర్‌లో ఒక్కరోజే 1467 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో కేసుల సంఖ్య 59,711కు పెరిగింది. వైరస్ కారణంగా ఇప్పటివరకు అక్కడ 951 మరణాలు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:'మరణాల రేటు 1% దిగువకు తేవడమే లక్ష్యం'
Last Updated : Sep 17, 2020, 9:42 PM IST