తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో కరోనా ఉగ్రరూపం-ఒక్కరోజే 13 వేల కేసులు - కేరళలో కరోనా

దేశంలో కరోనా మహమ్మారి కోరలుచాస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 13,165 మందికి వైరస్​ సోకింది. మరో 346 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ఇవాళ 5,795 మంది కరోనా బారినపడ్డారు. కేరళలో మొత్తం కేసులు 50 వేలు దాటాయి.

CORONA CASES IN INDIA
'మహా'లో కరోనా ఉగ్రరూపం-ఒక్కరోజే 13 వేల కేసులు

By

Published : Aug 19, 2020, 8:18 PM IST

భారత్​లో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఆందోళనకర స్థాయిలో రోజురోజుకూ వేలసంఖ్యలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 13,165 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 6,28,642కు చేరింది. మరో 346 మంది మృతిచెందగా.. మరణాల సంఖ్య 21,033కు పెరిగింది.

ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 4,46,881 మంది వైరస్​ను జయించి డిశ్చార్జి​ అయ్యారు. 1,60,413 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • తమిళనాడులో 5 వేల 795 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 3 లక్షల 55 వేలు దాటాయి. మరో 116 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 6,123కు చేరింది.
  • కర్ణాటకలో కొత్తగా 8 వేల 642 కరోనా కేసులు వెలుగుచూడగా.. మొత్తం బాధితుల సంఖ్య 2.5 లక్షలకు చేరువైంది. మరో 126 మంది మృతితో, చనిపోయిన వారిసంఖ్య 4 వేల 327కు పెరిగింది.
  • కేరళలో బుధవారం.. 2వేల 333 కేసులు బయటపడ్డాయి. మరో ఏడుగురు మరణించారు. మొత్తం కేసులు 50 వేలు దాటగా.. మరణాలు 182కు చేరాయి.
  • దిల్లీలో ఇవాళ 1398 కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశరాజధానిలో లక్షా 56 వేల 139 మంది కరోనా బారినపడ్డారు. మరో 4 వేల 235 మంది కొవిడ్​కు బలయ్యారు.

ఇదీ చదవండి:అమెరికా నుంచి భారత్​కు మరో 100 వెంటిలేటర్లు

ABOUT THE AUTHOR

...view details