తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సరిహద్దుల్లో యుద్ధం లేదు, శాంతి లేదు' - border latest news

భారత-చైనా సరిహద్దుల్లో పరిస్థితుల గురించి రక్షణశాఖకు చెందిన అధికారులతో చర్చించారు వైమానిక దళ ప్రధానాధికారి ఆర్​కేఎస్​ భదౌరియా. తూర్పు సరిహద్దుల వద్ద యుద్ధం లేదు, శాంతి లేదు అనే పరిస్ధితి ఉందన్నారు. అయితే ఎలాంటి అసాధారణ పరిస్ధితి ఎదురైనా తిప్పికొట్టేందుకు భారత సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు భదౌరియా.

'No war no peace' scenario in eastern Ladakh: IAF chief
'సరిహద్దుల్లో యుద్ధం లేదు, శాంతి లేదు'

By

Published : Sep 29, 2020, 4:52 PM IST

Updated : Sep 29, 2020, 5:03 PM IST

చైనాతో వివాదం నెలకొన్న తూర్పు సరిహద్దుల వద్ద యుద్ధం లేదు, శాంతి లేదు అనే పరిస్ధితి ఉందని వైమానిక దళ ప్రధానాధికారి ఆర్​కేఎస్​ భదౌరియా తెలిపారు. రక్షణ శాఖకు చెందిన వివిధ అధికారులు, నిపుణులతో వర్చువల్‌ సమావేశంలో మాట్లాడిన భదౌరియా.. ఎలాంటి అసాధారణ పరిస్ధితి ఎదురైనా తిప్పికొట్టేందుకు భారత సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

రఫేల్‌ సహా వైమానిక దళంలో ఇటీవల అనేక అధునాతన యుద్ధ విమనాలు, హెలికాప్టర్లు చేరాయన్నారు భదౌరియా. ఫలితంగా వైమానిక దళం వ్యూహాత్మకంగా మరింత బలోపేతం అయిందని వివరించారు. వైమానిక దళంలో స్వదేశీ సాంకేతికతను పెంచేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

"దేశ తూర్పు సరిహద్దుల వద్ద యుద్ధం లేదు, శాంతి లేదు అనే పరిస్థితి ఉంది. మన సైనిక దళాలు ఎలాంటి అసాధారణ పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన దురాక్రమణలను తిప్పికొట్టడంలో భారత వైమానిక దళం వేగంగా స్పందించింది. శత్రువును ఎదుర్కొనేందుకు భారత వైమానిక దళం సాంకేతికతను పెంచుకుంటోంది. ఇటీవల రఫేల్, సీ-17, చినూక్, అపాచీ వంటి విమానాలు, హెలికాప్టర్లను చేర్చుకోవడం వల్ల వైమానిక దళ నిజమైన, వ్యూహాత్మకమైన బలం మరింత పెరిగింది. రెండు తేలికపాటి యుద్ధ విమాన స్క్వాడ్రన్లను చేర్చుకోవడం సహా ఎస్‌యూ-30 ఎంకెఐ యుద్ధ విమానాల్లో దేశంలో తయారైన ఆయుధాలను తక్కువ సమయంలోనే అమర్చడమనేది.. స్వదేశీ సాంకేతికత సాధించడం దిశగా గొప్ప పరిణామం."

- ఆర్‌.కె.ఎస్‌ భదౌరియా, వైమానిక దళ ప్రధానాధికారి

ఇదీ చూడండి:'బాబ్రీ' తీర్పు నేపథ్యంలో లఖ్​నవూలో భద్రత కట్టుదిట్టం

Last Updated : Sep 29, 2020, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details