తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార పట్టి మురికి కాలువను శుభ్రం చేసిన మంత్రి!

ఓ రాష్ట్ర మంత్రి ప్రజల సమస్యలను స్వయంగా తీరుస్తున్నారు, పరిసరాలను స్వహస్తాలతో శుభ్రపరుస్తున్నారు. 8 అడుగుల లోతయిన మురికి కాలువలోకి దిగి.. పార చేత పట్టి మలినాలు తీసేశారు.  ఇంతకీ.. ఆ మంత్రి ఎవరో? ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం

పార పట్టి మురికికాలువను శుభ్రం చేసిన రాష్ట్రమంత్రి!

By

Published : Nov 3, 2019, 3:41 PM IST

Updated : Nov 3, 2019, 5:31 PM IST

పార పట్టి మురికి కాలువను శుభ్రం చేసిన మంత్రి!

మధ్యప్రదేశ్​లో అధికారంలో ఉన్న హస్తం పార్టీ నేత మురికి కాలువలు శుభ్రం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల పురపాలకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రధుమన్​ సింగ్​ తోమర్.. గాల్వియర్​ నియోజకవర్గంలోని బిర్లానగర్​లో పరిశుభ్రత డ్రైవ్​ చేపట్టారు. స్థానిక 16వ వార్డులోని మురికి కాలువలోకి దిగి శుభ్రం చేశారు.

ఎనిమిది అడుగుల లోతున్న ఈ కాలువ చాలా రోజులగా శుభ్రపరచకపోవడం వల్ల దుర్గంధంతో నిండిపోయింది. చెత్త పేరుకుపోవడం వల్ల మురికి నీరు ప్రజల ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. ప్రజా సమస్య తెలుసుకున్న నేత.. వెంటనే ఇలా పారతో కాలువలోకి దిగి చెత్తను బయటకు తీశారు.

ఇటీవల రాష్ట్రంలోని కాంగ్రెస్​ నేతలతో సమావేశమైన ప్రధుమన్​.. 'ఆల్ ఈజ్ వే' సందేశాన్ని ఇచ్చారు. ప్రధుమన్​ నియోజకవర్గం వ్యాప్తంగా 30 రోజుల పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమం చేపట్టాలని సంకల్పించారు. ఆ క్రమంలోనే ఇలా పారా చేతబట్టి మోరీలోకి దిగారు ఈ నేత.

ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం

Last Updated : Nov 3, 2019, 5:31 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details