తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి' - డీఎస్​పీఈ చట్టం

కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలోకి వెళ్లి దర్యాప్తు చేపట్టాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. వారి అనుమతి లేకుండా ఎలాంటి దర్యాప్తు చేపట్టడానికి వీలులేదని తేల్చింది.

Supreme court
సుప్రీం కోర్టు

By

Published : Nov 19, 2020, 2:37 PM IST

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేపట్టాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. అనుమతి లేకుండా ఎలాంటి దర్యాప్తు చేయకూడదని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే తమపై అవినీతి ఆరోపణల కేసులు దర్యాప్తు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నిందితులు, ప్రైవేటు, ప్రభుత్వ​ ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్​ ఖాన్విల్కర్​, జస్టిస్​ బీఆర్​ గవాయ్​ల ధర్మాసనం.. దిల్లీ ప్రత్యేక పోలీసు ఏర్పాటు చట్టం (డీఎస్​పీఈ)లోని సెక్షన్​ 5, 6ను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

" డీఎస్​పీఈ సభ్యుల అధికారాలను, పరిధిని కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఒక రాష్ట్రానికి విస్తరించటానికి సెక్షన్​ 5 కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది. అయితే, అది.. రాష్ట్రాల అనుమతి లేకుండా దర్యాప్తు చేపట్టకూడదని సెక్షన్​ 6 చెబుతోంది."

- సుప్రీం ధర్మాసనం

పంజాబ్​, బంగాల్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, ఝార్ఖండ్​, ఛత్తీస్​గడ్​ వండి రాష్ట్రాలు సీబీఐ తమ రాష్ట్రంలోకి రాకుండా తీర్మానాలు చేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి: స్వలింగ వివాహాలపై కేంద్రానికి నోటీసులు

ABOUT THE AUTHOR

...view details