తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"పారికర్​ నుంచే దర్యాప్తు ప్రారంభించండి" - Parrikar

రఫేల్​ ఒప్పంద పత్రాలు చోరీకి గురవటంపై విచారణ జరపించాలని కాంగ్రెస్​ అధ్యక్షులు రాహుల్​గాంధీ డిమాండ్​ చేశారు. అప్పటి రక్షణమంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ నుంచే దర్యాప్తును ఆరంభించాలని సూచించారు. రఫేల్​ ఒప్పంద పత్రాలు తనవద్దే ఉన్నాయని కేబినేట్​ సమావేశంలో పారికర్​ పేర్కొన్నట్లు రాహుల్​ తెలిపారు.

రఫేల్​ పత్రాలపై దర్యాప్తును పారికర్​ నుంచే ప్రారంభించాలని రాహుల్ డిమాండ్

By

Published : Mar 9, 2019, 6:41 AM IST

Updated : Mar 9, 2019, 7:41 AM IST

రఫేల్​ పత్రాలపై దర్యాప్తును పారికర్​ నుంచే ప్రారంభించాలని రాహుల్ డిమాండ్
రఫేల్​ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపటంపై రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. గోవాలోని పార్టీ కార్యకర్తలతో సమావేశమైన రాహుల్​... ఈ విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేశారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ నుంచే దర్యాప్తు ప్రారంభించాలని సూచించారు. రఫేల్​ ఒప్పంద పత్రాలు తనవద్దే ఉన్నట్లు అప్పటి రక్షణమంత్రి పారికర్​ గతంలో పేర్కొన్నారని తెలిపారు.

" గోవా నుంచి ప్రభుత్వం కనిపించకుండా పోయినట్లుగా... కేంద్ర ప్రభుత్వం రఫేల్​ పత్రాలు చోరీకి గురయ్యాయని చెప్పింది. రఫేల్​ పత్రాలు తనవద్దే ఉన్నాయని కేబినెట్​ భేటీలో పారికర్​ స్పష్టంగా చెప్పారు. ఆడియో టేపులు కూడా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తనని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించలేరని పారికర్ అన్నారు​. తొలగించిన రోజున రఫేల్​ పత్రాలను బయటపెడతానని స్పష్టం చేశారు. అందుకే దర్యాప్తు చేపట్టాలనుకుంటే పారికర్​ నుంచే మొదలెట్టండి"

- రాహుల్​ గాంధీ, కాం గ్రెస్​ పార్టీ అధ్యక్షులు.

Last Updated : Mar 9, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details