లద్దాఖ్ 'అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్'-లేహ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న కౌన్సిల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 26 నియోజకవర్గాల్లోని 294 పోలింగ్ కేంద్రాల్లో 89,776 మంది ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు.
ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ నుంచి 26 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రత్యేక హోదా రద్దయి, కేంద్ర పాలిత ప్రాంతంగా గతేడాది అవతరించిన తర్వాత లద్దాఖ్‌లో జరగనున్న తొలి ప్రజాస్వామిక కార్యక్రమమిది.
"ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకున్నాం. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తవుతుందని ఆశిస్తున్నాం."