తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆయుధాలతో సహా పట్టుబడ్డ జైషే ఉగ్రవాదులు

జమ్ము కశ్మీర్​లో ముగ్గురు జైషే మహమ్మద్​ ఉగ్రవాదులను భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి నాలుగు ఏకే 56, రెండు ఏకే-47 రైఫిళ్లు, ఆరు మేగజైన్లు, 180 రౌండ్ల తుపాకీ గుళ్లు స్వాధీనం చేసుకున్నాయి. ముష్కరులు పంజాబ్​లోని బమ్యాల్​ నుంచి కశ్మీర్​కు ట్రక్కులో ఆయుధాలు తరలిస్తుండగా భద్రతాదళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి.

ముగ్గురు ఉగ్రవాదుల అరెస్టు-ఆరు ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం

By

Published : Sep 12, 2019, 1:41 PM IST

Updated : Sep 30, 2019, 8:14 AM IST

జమ్ము కశ్మీర్​ కథువాలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో వెళ్తోన్న ఓ ట్రక్కును భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. అందులోని జైషే మహమ్మద్​కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాయి. నాలుగు ఏకే 56, రెండు ఏకే-47 రైఫిళ్లు, ఆరు మేగజైన్లు, 180 రౌండ్ల తుపాకీ గుళ్లు స్వాధీనం చేసుకున్నాయి.

ఉగ్రవాదులు పంజాబ్​లోని బమ్యాల్​ ప్రాంతం నుంచి కశ్మీర్​కు ఆయుధాలు తరలించడానికి ప్రయత్నించినట్లు భద్రతాదళాలు గుర్తించాయి.

ఆర్టికల్​ 370 రద్దు చేసిన తరువాత భారత్​-పాక్​ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదే అదనుగా ఉగ్రదాడులకు ప్రయత్నిస్తున్నారు పాక్ ఆధారిత ముష్కరులు.

ఇదీ చూడండి: భారత్​ X చైనా: మరోసారి సరిహద్దు ఉద్రిక్తతలు

Last Updated : Sep 30, 2019, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details