తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఓ ఉగ్రవాది హతం - శ్రీనగర్​ ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లోని పాంత చౌక్​ వద్ద ఉన్న పోలీసులు-సీఆర్​పీఎఫ్​ బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు అప్రమత్తమవడం వల్ల ఆ పరిణామాలు ఎన్​కౌంటర్​కు దారితీశాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఓ పోలీసు అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు.

Srinagar encounter: 1 terrorist killed. 1 police personnel ASI Babu Ram lost his life.
జమ్ముకశ్మీర్​ ఎన్​కౌంటర్​- ఓ ఉగ్రవాది హతం

By

Published : Aug 30, 2020, 1:32 AM IST

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అదే సమయంలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.

తొలుత... పాంత చౌక్​ వద్ద ఉన్న పోలీసులు-సీఆర్​పీఎఫ్​ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు.. ఘటనాస్థలంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు మరోమారు కాల్పులకు తెగబడగా.. ఈ పూర్తి వ్యవహారం ఎన్​కౌంటర్​కు దారితీసింది.

ఇదీ చూడండి:-ఆగ్రా బస్​ హైజాక్​ ప్రధాన నిందితుడు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details