తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీజీ... ఆ లక్ష మందికీ పౌరసత్వం ఇవ్వండి'

శరణార్థులుగా ఉంటున్న శ్రీలంక తమిళులకు భారతీయ పౌరసత్వం కల్పించాలని కోరారు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్​. తమిళ గీత రచయిత వైరముత్తు సైతం ఇదే తరహా విజ్ఞప్తి చేశారు.

By

Published : Dec 10, 2019, 3:13 PM IST

citizenship
'మోదీజీ... ఆ లక్ష మందికీ పౌరసత్వం ఇవ్వండి'

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం నేపథ్యంలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ బిల్లుపై అధ్యాత్మిక గురువు శ్రీశీ రవిశంకర్​, తమిళ గీత రచయిత వైరముత్తు స్పందించారు. మూడు దశాబ్దాలుగా భారత్​లో తలదాచుకుంటున్న శ్రీలంక తమిళులకు పౌరసత్వం కల్పించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

"35 ఏళ్లుగా తమిళనాడులో ఉంటున్న లక్ష మందికిపైగా శ్రీలంక శరణార్థులకు పౌరసత్వం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి నా విన్నపం. ఈ అంశాన్ని కేంద్రం పరిశీలించాలి."

-శ్రీ శ్రీ రవిశంకర్​

శ్రీలంక తమిళులు శరణార్థులుగానే ఉండాల్సి వస్తోంది తప్ప... భారతీయులుగా గుర్తింపు పొందలేకపోయారని వైరముత్తు ఆవేదన వ్యక్తం చేశారు.

"శ్రీలంక శరణార్థులను పొరుగు దేశ పౌరులుగా భావించకూడదు. వారికీ భారతీయ పౌరసత్వం వర్తించేలా బిల్లును సవరణ చేసి మానవత్వం చూపాలి. "

-వైరముత్తు

ఇదీ చూడండి : 'కశ్మీర్​ రాజకీయ నేతల విడుదల మా చేతుల్లో లేదు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details