అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతుగా దేశవ్యాప్త కార్యక్రమం చేపట్టనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పేర్కొంది. నాలుగు లక్షల గ్రామాలను ఈ కార్యక్రమం ద్వారా మందిర నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. జనవరి 15 మకర సంక్రాంతి రోజు నుంచి ఫిబ్రవరి 14 వరకు మందిర నిర్మాణ విశేషాలను ఊరూరా వివరించనున్నట్లు చెప్పారు.
అయోధ్య గుడిపై ఊరూరా ప్రచారం - RSS
రామమందిర నిర్మాణానికి మద్దతుగా దేశవ్యాప్త కార్యక్రమం చేపట్టనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది. సంక్రాంతి నుంచి ఆలయ విశేషాలను నాలుగు లక్షల గ్రామాల ప్రజలకు వివరించి చెప్పనున్నట్లు వెల్లడించింది.
రామాలయ నిర్మాణానికి మద్దతుగా దేశవ్యాప్త కార్యక్రమం!
రామ మందిర ట్రస్ట్‌తో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ), హిందూ సంఘటన్ వంటి సంస్థలూ ఇందులో పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు ట్రస్టు ప్రతినిధులు.
ఇదీ చూడండి: ఐఐటీ మద్రాస్ కార్యకలాపాలు బంద్!