తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా టెస్టుల కోసం 'చిత్ర మాగ్నా' కిట్​కు అనుమతి

కరోనా వ్యాధిని మరింత సమర్థవంతంగా నిర్ధరించేందుకు కేరళలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ టెక్నాలజీ రూపొందించిన 'ఆర్​ఎన్​ఏ' కిట్​కు.. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. చిత్ర మాగ్నా అని నామకరణం చేసిన ఈ కిట్​ .. కొవిడ్-19 నిర్ధరణ ఫలితాలను అత్యంత వేగంగా, కచ్చితంగా ఇస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

sree chitra institute s RNA isolation kit gets Drugs Controllers approval
ఆర్​ఎన్​ఏ కిట్​కు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అనుమతి

By

Published : May 20, 2020, 2:37 PM IST

కేరళ తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ టెక్నాలజీ (ఎస్​సీటీఐఎంటీ) అభివృద్ధి చేసిన 'చిత్ర మాగ్నా' కిట్​కు... డ్రగ్ కంట్రోలర్​ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది. ఫలితంగా కొవిడ్-19 వ్యాధిని నిర్ధరణ చేసే ఆర్​ఎన్​ఏ కిట్​ను... పారిశ్రామిక స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఆ సంస్థ సిద్ధమైంది.

కచ్చితమైన ఫలితం!

చిత్ర మాగ్నా.. 'మ్యాగ్నటిక్​ బీడ్​ బేస్డ్​ ఆర్​ఎన్​ఏ ఐసోలేషన్​' సాంకేతికత​ ఆధారంగా పని చేస్తుందని.. ఇది వేగవంతమైన, కచ్చితమైన ఫలితాలు ఇస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

7 రెట్లు అధికంగా..

ఎస్​సీటీఐఎంటీ శాస్త్రవేత్తల ప్రకారం, సాధారణ వైరస్ టెస్టింగ్​ కిట్ కన్నా ఈ 'చిత్ర మాగ్నా' పరికరం.. కరోనా అనుమానితుడి నుంచి 7 రెట్లు అధికంగా ఆర్​ఎన్​ఏను సేకరిస్తుంది. ఫలితంగా బాధితుడి గొంతు లేదా ముక్కు నుంచి తీసుకున్న సాంపిల్​ ద్వారా.. అందులో సార్స్​-కొవ్​ 2 ఆర్​ఎన్​ఏ ఉందో లేదో వేగంగా నిర్ధరించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

అప్పుడప్పుడూ పరీక్షల కోసం తీసుకున్న నమూనా.. ల్యాబ్​కు తీసుకువెళ్లేటప్పుడు ఆర్​ఎన్​ఏ (రైబో న్యూక్లిక్ యాసిడ్​) రెండు భాగాలుగా విడిపోవచ్చు. అయితే ఈ చిత్ర మాగ్నా కిట్​లోని సాంకేతికత విడిపోయిన ఆర్​ఎన్​ఏను కూడా సేకరించి పరీక్షించగలదు.

ప్రత్యేక పద్ధతిలో..

పాలిమరైజ్​ చైన్​ రియాక్షన్​ (పీసీఆర్​) లేదా లూప్​ మీడియోటెడ్​ ఐసోథర్మల్​ యాంప్లిఫికేషన్ (ఎల్​ఏఎంపీ)​ పద్ధతి ఉపయోగించి.. ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏ (డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ )గా మార్చుతారు. ఆ తర్వాత ఏయే ప్రాంతల్లో వైరస్​ డీఎన్​ఏ ఉందో 'చిత్ర మాగ్నా' గుర్తిస్తుంది. దీని ఆధారంగా ఆ వ్యక్తికి కరోనా సోకిందో లేదో నిర్ధరిస్తారు.

ఇదీ చూడండి:టీబీ డయాగ్నోస్టిక్ యంత్రాలతో కరోనా పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details