తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ కిట్​తో మరింత వేగంగా కరోనా నిర్ధరణ పరీక్షలు! - కరోనా పరీక్ష కిట్​ను తయారు చేసి కేరళ వైద్య సంస్థ

కరోనా పరీక్షల్లో వేగంగా, కచ్చితమైన ఫలితాలు అందించే పరికరాన్ని తయారు చేసింది కేరళకు చెందిన ఎస్​సీటీఐఎంటీ సంస్థ. అయితే భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)​, డ్రగ్​ కంట్రోల్​ జనరల్​ ఆఫ్​ ఇండియా(డీసీజీఐ) అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.

Sree Chitra Institute develops Chitra Magna RNA extraction kits  Expected to increase accuracy and speed of COVID testing procedure
ఈ కిట్​తో వేగంగా కరోనా నిర్ధరణ పరీక్షలు!

By

Published : Apr 25, 2020, 7:21 PM IST

కరోనా పరీక్షలో కచ్చితత్వం సహా వేగంగా ఫలితాలు రాబట్టే పరికరాన్ని తయారు చేయడానికి పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. వైరస్​ను గుర్తించే పరికరాన్ని.. కేరళ తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాళ్​ ఇనిస్టిట్యూట్ ఫర్​ మెడికల్​ టెక్నాలజీ (ఎస్​సీటీఐఎంటీ) అభివృద్ధి చేసింది.

ఈ పరికరానికి 'చిత్ర మాగ్నా' అని నామకరణం చేశారు. 'మ్యాగ్నటిక్​ బీడ్​ బేస్డ్​ ఆర్​ఎన్​ఏ ఐసోలేషన్​' సాంకేతికత​ ఆధారంగా ఈ పరికరం పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది వేగవంతమైన, కచ్చితమైన ఫలితాలు ఇస్తుందన్నారు.

7 రెట్లు అధికంగా..

సాధారణ వైరస్ టెస్టింగ్​ కిట్ కన్నా ఈ 'చిత్ర మాగ్నా' పరికరం.. కొవిడ్​-19 అనుమానితుడి నుంచి 7 రెట్లు అధికంగా ఆర్​ఎన్​ఏను సేకరిస్తుందని వెల్లడించారు పరిశోధకులు.

సాధారణంగా పరీక్షల కోసం తీసుకున్న నమూనా ల్యాబ్​కు తీసుకువెళ్లేటప్పుడు, రవాణాలో ఆర్​ఎన్​ఏ రెండు భాగాలుగా విడిపోవచ్చు. అయితే ఈ కిట్​ సాంకేతికత విడిపోయిన ఆర్​ఎన్​ఏను కూడా సేకరిస్తుంది.

బాధితుడి గొంతు లేదా ముక్కు నుంచి తీసుకున్న సాంపిల్​ ద్వారా అందులో సార్స్​-కొవ్​ 2 ఆర్​ఎన్​ఏ ఉందో లేదో నిర్ధరించవచ్చని పరిశోధకులు తెలిపారు.

ప్రత్యేక పద్ధతిలో..

ఆర్‌ఎన్‌ఏను... పోలీమరైజ్​ చైన్​ రియాక్షన్​ (పీసీఆర్​) లేదా లూప్​ మీడియోటెడ్​ ఐసోథర్మల్​ ఎంప్లిఫికేషన్(ఎల్​ఏఎంపీ)​ పద్ధతిలో డీఎన్‌ఏగా మార్చుతారు. ఏయే ప్రాంతల్లో వైరస్​ డీఎన్​ఏ ఉందో ఈ 'చిత్ర మాగ్నా' గుర్తిస్తుంది. దీని ఆధారంగా ఆ వ్యక్తికి కరోనా సోకిందో లేదో నిర్ధరిస్తారు.

అనుమతి కోసం..

డాక్టర్​ అనూప్​ తెక్కువీటిల్​ ఆధ్వర్యంలోని పరిశోధన బృందం ఈ చిత్ర మాగ్నాను అభివృద్ధి చేసింది. అయితే భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​), డ్రగ్​ కంట్రోల్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం ఎదురుచూస్తుంది. అనుమతి లభిస్తే చిత్ర మాగ్నాను పరికరాలను మరింత ఉత్పత్తి చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:'కరోనాపై పోరులో భారత విధానాలు భేష్'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details