జమ్ముకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కిష్తవాడ్ జిల్లా తండార్ గ్రామంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు ప్రత్యేకాధికారి చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు ప్రత్యేకాధికారులపై ఇవాళ మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వారి వద్ద నుంచి రెండు సర్వీసు రైఫిళ్లను ఎత్తుకెళ్లారు.